Nandini | పెళ్లి చేసుకోమని ఒత్తిడి.. ప్రముఖ టీవీ నటి నందిని ఆత్మహత్య… బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం
Nandini | కన్నడ, తమిళ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ‘జీవ హూవాగిదే’, ‘సంఘర్ష’, ‘గౌరి’ వంటి పాపులర్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని సి.ఎం. బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
Nandini | కన్నడ, తమిళ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ‘జీవ హూవాగిదే’, ‘సంఘర్ష’, ‘గౌరి’ వంటి పాపులర్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని సి.ఎం. బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనతో ఆమె అభిమానులు, సహ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నందిని నివాసంలో ఓ సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో నందిని మానసిక ఒత్తిడికి, డిప్రెషన్‌కు గురైనట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై స్పష్టత రావడం లేదని పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.నందిని తక్కువ కాలంలోనే తన నటనతో మంచి అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా తమిళ సీరియల్ ‘గౌరి’ లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే సీరియల్లో ఇటీవల ఆమె పాత్ర ఆత్మహత్యాయత్నం చేసే సన్నివేశం ప్రసారమవడం గమనార్హం. అయితే ఆ సీరియల్ కథకు, నందిని మరణానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
నందిని అకాల మరణ వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ–టీవీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గ్లామర్ రంగంలో ఉన్న ఒత్తిళ్లు, కళాకారులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమెకు తుది నివాళులు అర్పించేందుకు పలువురు సహ నటులు బెంగళూరుకు చేరుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

