మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హోల్సమ్ మ్యాజికల్ ఎంటర్టైనర్ ‘టుక్ టుక్’
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ
వైవిధ్యమైన సినిమాలకు, న్యూ కాన్సెప్ట్‌లకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాలను చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అఖండ విజయాన్ని అందిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ కోవలోనే ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్ టుక్’.
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మహా శివరాత్రి కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ” న్యూ ఏజ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే స్కూటర్ కమ్ ఆటో ఎన్నో మ్యాజికల్ పవర్స్‌ను కలిగి ఉంటుంది. అందరూ ఆ వెహికల్ ప్రేమలో పడిపోతారు. దానికి ఓ మంచి రహస్యం కూడా ఉంటుంది. సినిమాలో ఎంతో ఎంటర్టైన్మెంట్ను కూడా పంచుతుంది.
యువతరం నచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే విశ్వాసం వుంది’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ” సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, “టుక్ టుక్” ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంటుంది. అసలు కథలో ఆ స్కూటర్ కమ్ ఆటో పాత్ర ఏంటి అనేది సినిమాలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో కొనసాగుతుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది. ఈ వేసవికి ప్రేక్షకులకు మంచి వినోదం అందించండానికి మార్చి 21న మా టుక్ టుక్ రెడీ అవుతోంది’ అన్నారు. సంతు ఓంకార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

