విజయ్ దేవరకొండ హీరోయిన్ల జాతకాన్ని టక్ జగదీష్ అయినా మారుస్తాడా..?

టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు అంతగా కలిసిరాదు.. ఇక్కడ వాళ్లు స్టార్ హీరోయిన్ హోదా అందుకోవడం చాలా కష్టం.. ఎన్నో సంవత్సరాలుగా మన దగ్గర ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ఇదే. తెలుగు ఇండస్ట్రీలో మన అమ్మాయిలకు చోటు ఉండదని విమర్శలు కూడా ఉన్నాయి. అందాల ఆరబోతలో కాస్త అడ్డు చెబుతారు కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు వెనకాడతారు అంటూ కొందరు బాహాటంగానే అభిప్రాయం తెలిపారు. దీంతో ఇక్కడ హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తెలుగమ్మాయిల్లో టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్.. ఈ ఏడాది తిమ్మరుసు, SR కల్యాణమండపం సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ వంటి తెలుగమ్మాయిలు కూడా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదా కోసం పాట్లు పడుతున్నారు.
రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ ఇద్దరు హీరోయిన్లకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగులోనే వీరికి అవకాశాలు అరకొరగా వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆమె పాత్ర మాత్రం సూపర్ హిట్ అయింది. దాంతో పాటు కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో కూడా ఐశ్వర్య పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేవు. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో మాత్రం హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. ఇదే సినిమాలో మరో తెలుగమ్మాయి రీతూ వర్మ కూడా నటించింది. ఎవడే సుబ్రమణ్యం తర్వాత నానితో మరోసారి జోడీ కట్టింది రీతూ వర్మ.
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఆ స్థాయి విజయం రీతూ వర్మకు రాలేదు. దీంతో ఈమె ఆశలన్నీ టక్ జగదీష్ సినిమాపైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో ఇద్దరు తెలుగమ్మాయిలు బాగా హైలెట్ అయ్యారు. సినిమాలో కూడా ఇద్దరి పాత్రలకు మంచి స్కోప్ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. అయితే టక్ జగదీష్ సినిమా థియేటర్లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుండటమే ఈ ఇద్దరికీ మైనస్ అయ్యే ఛాన్సుంది. ఎంతైనా సినిమా థియేటర్లో విడుదలైతే హీరోయిన్లకు వచ్చే గుర్తింపు.. డిజిటల్ మీడియాలో అయితే రాదు. మరి చూడాలి నాని సినిమాతో ఈ ఇద్దరి తెలుగమ్మాయిల దశ మారుతుందో లేదో..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
Tollywood | సెప్టెంబర్ 4న వైఎస్ జగన్‌తో సినీ పెద్దల భేటీ..!
బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
చిరంజీవిని మించి పవన్ కళ్యాణ్ బర్త్ డే.. రోజంతా సర్‌ప్రైజ్‌లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

