మణికందన్, శ్రీగౌరిప్రియ నటించిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఆదివారం ట్రైలర్ను విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ ‘ఓ జంట తమ ప్రేమను కాపాడుకునేందుకు ఎలాంటి సంఘర్షణను అనుభవించారనే అంశాన్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు. దర్శకుడు అనుభవంలోంచి వచ్చిన కథ ఇది.
దాదాపు ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాసుకున్నానని డైరెక్టర్ నాతో చెప్పాడు. ఇలాంటి చక్కటి ప్రేమకథను తెలుగు ప్రేక్షకులు మిస్ చేసుకోవద్దని కోరుతున్నా’ అన్నారు. ‘ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తున్నప్పుడు మేము తీసిన ‘బేబి’ సినిమా గుర్తుకొచ్చింది. రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నాం. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమించాలనుకునే వాళ్లందరూ ఈ సినిమాను తప్పకుండా ఇష్టపడతారు’ అని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పానని హీరో మణికందన్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్కృష్ణ, సంగీతం: సీన్ రోల్డన్, తెలుగు సంభాషణలు: మౌళి, తెలుగు రిలీజ్: మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్, రచన-దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్.