Jangaa | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ త్రిగుణ్. ఈ టాలెంటెడ్ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జంగా. ఈ చిత్రానికి కెవిన్ (గడ్డం శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వ వహిస్తున్నాడు.
త్రిగుణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ జంగా మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఇందులో రా అండ్ రస్టిక్ లుక్‌లో ఊరమాస్‌గా కనిపించబోతున్నట్టు మోషన్ పోస్టర్ చెబుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటలు రాస్తున్నారు. ఈ మూవీని వనిత కిలారి సమర్పణలో ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయ చంద్ర నాయుడు కిలారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నేహా పఠాన్ హీరోయిన్గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, సమీర్, రఘుకారుమంచి, రచ్చ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Unveiling a powerful new side of @thrigun_aactor from the world of #Jangaa 💥
Team #Jangaa wishes @thrigun_aactor a very Happy Birthday❤#HappyBirthdayThrigun@varusarath5 @UrsGaganBabu @iammadhunandan @Neha_pathan3 @ActorSravan7 #Kevyngaddam #Ramyakilari @RKFilmfactory01… pic.twitter.com/2kfEisa2J0
— BA Raju’s Team (@baraju_SuperHit) June 8, 2026
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు