ఆయన ఉచ్ఛాసం కవనం
దిగ్గజ సినీ గీతరచయిత పద్మశ్రీ స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం ‘నా ఉచ్ఛాసం కవనం’. శృతిలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రతి ఆదివారం ఉదయం 9.30 నిమిషాలకు ప్రసారం కానుంది.
దిగ్గజ సినీ గీతరచయిత పద్మశ్రీ స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం ‘నా ఉచ్ఛాసం కవనం’. శృతిలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రతి ఆదివారం ఉదయం 9.30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రోగ్రాం కర్టన్‌రైజర్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. శృతిలయ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ చెరువు మాట్లాడుతూ ‘సిరివెన్నెలగారి దగ్గరకు ఎవరెళ్లినా ముందు తన పాట ఒకటి పాడి వినిపిస్తుండేవారు. ఓసారి మేం వెళ్లాం. మాకు కొన్ని పాటలు వినిపించారు.
అవి హిట్ సాంగ్స్ కావు. కానీ సాహిత్యపరంగా ఎంతో విలువైన పాటలు. ఆ పాటలు, అవి రాయడానికి శాస్త్రిగారు చేసిన కృషి తెలుసుకున్న తర్వాత, ఆ విషయాలు అందరికీ తెలియజేయాలనే ఆలోచన కలిగింది. అలా మొదలైందే ‘సిరివెన్నెల అంతరంగం’ కార్యక్రమం. అప్పట్లో ఆ కార్యక్రమాన్ని మూడు ఎపిసోడ్స్‌గా చేద్దాం అనుకున్నాం. 13 ఎపిసోడ్స్ అయ్యింది. వాటికి బహుళ ప్రచారంలోకి తెద్దామనుకుంటే సిరివెన్నెలగారు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన పరమపదించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని జనంలోకి తెస్తున్నాం. దానికి రూపమే ‘నా ఉచ్ఛాసం కవనం’.’ అని తెలిపారు. ఏ సినిమా మొదలుపెట్టినా పాటలకోసం సిరివెన్నెలగారినే కలిసేవాడ్ననీ, ఆయన లేకపోవడంవల్ల అనాథగా మారిన భావన కలుగుతుందని దర్శకుడు కృష్ణవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకా సిరివెన్నెల సోదరుడు శ్రీరామశాస్త్రి, గాయకుడు పార్థసారథి, డాక్టర్ గురవారెడ్డి, జర్నలిస్ట్ ప్రభు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

