Triangle love story | ముక్కోణపు ప్రేమ దియా

దీక్షిత్‌శెట్టి, పృథ్వీ, ఖుషి నాయకానాయికలుగా నటించిన కన్నడ చిత్రం ‘దియా’. ఈ సినిమాను నిర్మాతలు ఆర్కే నల్లం, రవికశ్యప్ తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. కె. ఎస్. అశోక దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. ఓ యువతి జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరబ్బాయిలు, వారి ప్రేమప్రయాణం ఏ తీరాలకు చేరిందనేది హృద్యంగా ఉంటుంది. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది’ అని తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిదని హీరోయిన్ ఖుషి చెప్పింది. మూడు హృదయాల సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించే చిత్రమిదని గేయరచయిత పూర్ణాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, నరసింహా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

