రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ హీరోగా నటిస్తున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు కథానాయిక. మంచా ల నాగరాజ్ దర్శకుడు. మయూర్‌రెడ్డి బండారు నిర్మాత. ఈ నెల 10న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. అగ్ర దర్శకుడు శివ నిర్వాణ అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. హీరో రామ్ పోతినేని డిజిటల్ ద్వారా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ‘బేసిగ్గా అన్నదమ్ముల మధ్య ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక దున్నపోతుకు మనిషికి ఉండే ఎమోషన్ని చూస్తారు. రవితేజ ఈ సినిమా చూశారు. ఆయనకు ైక్లెమాక్స్ బాగా నచ్చింది. చాలా ఎమోషనల్ అయ్యారు’ అని హీరో మాధవ్ పేర్కొన్నారు. ట్రైలర్‌కి పదిరెట్లు సినిమా ఉంటుందని దర్శకుడు నాగరాజ్ నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాత మయూర్‌రెడ్డి బండారు, నటుడు వికాస్ వశిష్ట కూడా మాట్లాడారు.