మనోజ్‌కుమార్, మోహన సిద్ధి, శృతి శంకర్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ ‘సిద్ధుగాడి లవ్‌స్టోరీ’. రమేశ్ చెరుకూరు దర్శకుడు. సావిత్రమ్మ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, వీఎన్ ఆదిత్య, వి.సముద్ర, రామ్‌ప్రసాద్, నిర్మాతలు వి.దామోదరప్రసాద్, అశోక్‌కుమార్, టి.ప్రసన్నకుమార్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. సందేశంతో కూడిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు రమేశ్ చెరుకూరు చెప్పారు. సొంతూరిని వదిలి, దూరప్రాంతాలకు వెళ్లిన వారి జీవితాలకు ఈ కథ మరింత దగ్గరగా ఉంటుందని హీరో మోహనసిద్ధి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాట లు: మొండెం శ్రీధర్, కెమెరా: దోసడ యాదగిరి, సంగీతం: ఆదిత్య.