Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Music Director Deva | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు.
Music Director Deva | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో ‘తేనిసై తెండ్రల్’ (మధుర సంగీత సమీరం)గా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన దేవా సుదీర్ఘ ప్రస్థానంలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన అందించిన సంగీతం ఎంతో ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’, పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ‘తొలిప్రేమ’, రజనీకాంత్ సూపర్ హిట్ డబ్బింగ్ మూవీ ‘బాషా’, అలాగే ‘ఖుషి’ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ముఖ్యంగా తమిళ జానపద ‘గానా’ సంగీత శైలిని వెండితెరకు పరిచయం చేసి, మాస్ బీట్స్‌తో ఆబాలగోపాలాన్ని అలరించడంలో ఆయనది అందె వేసిన చేయి. దేవా కుటుంబం విషయానికి వస్తే, ఆయన కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తుండగా, ఆయన సోదరులు సబేష్-మురళి కూడా మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు. ప్రస్తుతం దేవా హఠాన్మరణం పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, సంగీత అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

