PS Mithran | సర్దార్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్‌కు కారు బహుమతి.. ఎవరిచ్చారో తెలుసా..?
స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సర్దార్ (Sardar) అక్టోబర్ 21న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. కాసుల వర్షం కురిపిస్తుండంతో నిర్మాత, ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్ లక్ష్మణ్‌కుమార్ తన సంతోషాన్ని బహుమానం రూపంలో వ్యక్తం చేశాడు.
కార్తీ (Karthi)-పీఎస్ మిత్రన్ (PS Mithran) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సర్దార్ (Sardar). స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 21న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్‌తో ప్రదర్శించబడుతూ.. కార్తీకి మరో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కాసుల వర్షం కురిపిస్తుండంతో నిర్మాత, ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్ లక్ష్మణ్‌కుమార్ తన సంతోషాన్ని బహుమానం రూపంలో వ్యక్తం చేశాడు.
నిర్మాత ఎస్ లక్ష్మణ్‌కుమార్ సర్దార్తో మంచి సక్సెస్ అందించిన పీఎస్ మిత్రన్‌కు టయోటా కారును బహుమతిగా అందించారు. కారు తాళం చెవిని హీరో కార్తీ చేతుల మీదుగా డైరెక్టర్ మిత్రన్‌కు అందించాడు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సర్దార్ డబుల్ థ్రిల్, సస్పెన్స్‌ను అందించేందుకు సర్దార్ 2గా రాబోతున్న సంగతి తెలిసిందే.
మిషన్ కంబోడియా త్వరలో మొదలవుతుంది.. అంటూ మేకర్స్ ఇప్పటికే సర్దార్ 2 అప్డేట్ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేయనున్న సర్దార్ 2 మూవీ 2023లో విడుదల కానుంది.
After the blockbuster success of #Sardar, Producer @lakku76 presented a brand new car to director @Psmithran . Actor @Karthi_Offl handed over the key pic.twitter.com/9XBzIDE5TR
— Rajasekar (@sekartweets) November 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

