టాక్సిక్‌లో లేడీ విలన్స్?
సినిమా కలర్ఫుల్గా ఉండాలంటే అందమైన హీరోయిన్ల అవసరం ఎంతైనా ఉంది. హీరోయిన్ అంటే సినిమాకు ఓ ఆభరణం. కథకు అందాన్ని తేవడంతోపాటు కథను నడిపంచడంలోనూ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తుంటారు.
సినిమా కలర్ఫుల్గా ఉండాలంటే అందమైన హీరోయిన్ల అవసరం ఎంతైనా ఉంది. హీరోయిన్ అంటే సినిమాకు ఓ ఆభరణం. కథకు అందాన్ని తేవడంతోపాటు కథను నడిపంచడంలోనూ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తుంటారు. అయితే.. అదే బాధ్యతను పానిండియా సినిమా ‘టాక్సిక్’ విషయంలో మరో విధంగా నిర్వర్తిస్తున్నారు అగ్ర కథానాయికలు నయనతార, కియారా అద్వానీ. ఈ సినిమాలో వారిద్దరూ బ్యాడ్‌యాస్ ఉమెన్‌గా కనిపించబోతున్నారు.
పూర్తి నెగెటివ్ షేడ్స్‌తో వీరి పాత్రలు సాగుతాయట. తెరపై వీరి పాత్రలు ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇస్తాయట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర కథానాయకుడు యష్ తెలిపారు. ‘ఈ తరహా పాత్రల్లో వారిద్దరినీ ఆడియన్స్ ఊహించి ఉండరు. నయన్, కియారా నటన ఈ సినిమాలో నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. వారిద్దరి కదలికలే కొత్తగా ఉంటాయి’ అని తెలిపారు యష్. ఆయన హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పానిండియా చిత్రం ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

