అగ్ర కథానాయిక కీర్తి సురేష్ పెళ్లి వార్తలు గత కొద్ది రోజులుగా హాట్‌టాపిక్‌గా మారాయి. తన చిన్ననాటి మిత్రుడితో ఈ భామ పెళ్లిపీటలెక్కబోతున్నదని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం గురించి కీర్తి సురేష్‌తో పాటు ఆమె తండ్రి కూడా వివరణ ఇచ్చారు. పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. అయినా సోషల్‌మీడియాలో ఈ అమ్మడి పెళ్లి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలావుండగా కీర్తి సురేష్ తాజా చిత్రం ‘మామన్నన్’ ఆడియో వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా పెళ్లి తాలూకు ప్రశ్నలే ఎదురయ్యాయి. దీంతో కాస్త అసహనానికి గురైన కీర్తి సురేష్ తనపెళ్లి గురించి మరోమారు అడగొద్దని పాత్రికేయులను కోరింది. ‘పెళ్లి విషయంలో ఇప్పటికే స్పష్టత నిచ్చాను. అయినా ప్రతీ సందర్భంలో ఇవే ప్రశ్నలడుగుతున్నారు. ఒకవేళ నా పెళ్లి కుదిరితే నేనే స్వయంగా చెబుతా’ అని కీర్తి సురేష్ తెలిపింది. ఇటీవల విడుదలైన ‘దసరా’ చిత్రంతో కీర్తి సురేష్ తెలుగులో భారీ విజయాన్ని దక్కించుకుంది.