Tom Cruise | 2 వేల అడుగుల ఎత్తులో డెడ్లీ స్టంట్.. డూప్ లేకుండా చేసిన హాలీవుడ్ హీరో
Tom Cruise | హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్.. తన హిట్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాజిబుల్’ నిజంగానే నమ్మలేని స్టంట్స్ చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ బ్లాక్బస్టర్లుగానే నిలిచాయి.

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్.. తన హిట్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాజిబుల్’ నిజంగానే నమ్మలేని స్టంట్స్ చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ బ్లాక్బస్టర్లుగానే నిలిచాయి. ఈ క్రమంలో ‘మిషన్ ఇంపాజిబుల్ 8’కు టామ్ శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా కోసం అసాధ్యమైన ఫీట్ చేశాడు.
గాల్లో ఎగురుతున్న విమానం రెక్క పట్టుకొని తలకిందులుగా వేలాడాడు. సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి స్టంట్స్ చేయరు. వాళ్ల డూప్స్ చేస్తారు. అయితే 59 ఏళ్ల టామ్ మాత్రం తన సినిమా కోసం ఈ స్టంట్ స్వయంగా చేశాడు. రెండు వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా.. దాని కాక్‌పిట్‌లో నుంచి బయటకు వచ్చి విమానం రెక్కపై కూర్చున్నాడు.
ఆ వెంటనే తలకిందులుగా వేలాడాడు. ఆ సమయంలోనే పైలట్ ఆ విమానాన్ని పల్టీ కొట్టించాడు. దీంతో టామ్ క్రూయిజ్.. తలకిందులైన విమానం రెక్కపై కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఈ స్టంట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

