Tollywood | ప్రముఖ నిర్మాత దారుణ హత్య.. ఆస్తి కాజేసేందుకు పక్కా ప్లాన్ వేసి మరి..
Tollywood | సిటీబ్యూరో : వృద్ధాప్యంలోని సినీ నిర్మాతను హత్యచేసి, అతడి ఆస్తిని కాజేసే కుట్రను గోపాలపురం పోలీసులు వెలుగులోకి తెచ్చారు. గోపాలపురం పోలీసుల వివరాల ప్రకారం.. పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి(71) నిర్మాతగా కొన్ని సినిమాలు తీశాడు.
Tollywood | సిటీబ్యూరో : వృద్ధాప్యంలోని సినీ నిర్మాతను హత్యచేసి, అతడి ఆస్తిని కాజేసే కుట్రను గోపాలపురం పోలీసులు వెలుగులోకి తెచ్చారు. గోపాలపురం పోలీసుల వివరాల ప్రకారం.. పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి(71) నిర్మాతగా కొన్ని సినిమాలు తీశాడు. ఇతడికి ముగ్గురు సంతానం కాగా.. ఒక కుమారుడు మోకిల్లాలో, మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. అయితే అంజిరెడ్డి అమెరికాలో ఉండాలని భావించి పౌరసత్వానికి దరఖాస్తు చేశారు. ఇటీవలే అది రాగా ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.
నిర్మాతగా ఉన్న సమయంలో సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన రవి కాట్రగడ్డతో చర్చించి, 8 నెలల క్రితం ఆయన అమెరికాకు వెళ్లాడు. రవి కాట్రగడ్డ, అంజిరెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన ఏజెంట్లు, వ్యాపారులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. నెల రోజుల క్రితం అంజిరెడ్డి, తన భార్యతో కలిసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో కాట్రగడ్డ రవి, జీఆర్ కన్వెన్షన్ యజమాని అయిన రాజేశ్‌ను అంజిరెడ్డికి పరిచయం చేశాడు. దీంతో రాజేశ్.. అంజిరెడ్డి ఆస్తుల గురించి చర్చించాడు. ముందుగా పద్మారావునగర్‌లో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తానని, దానికి మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దుతానంటూ నమ్మించాడు. అయితే, తాను సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయిస్తానంటూ రాజేశ్‌తో చెప్పాడు. దానికి కూడా ఒక పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ ఇద్దరు మహిళలను పరిచయం చేశాడు.
ఇదిలాఉండగా.. రాజేశ్ కన్ను పద్మారావునగర్‌లో ఉన్న ఇంటిపై పడింది. అంజిరెడ్డి తన భార్యతో కలిసి గత నెల 22న అస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, గత నెల 29వ తేదీ నాటికి ఇంటి అమ్మకం విషయాలు పూర్తి చేస్తానంటూ నమ్మించాడు. ఇంతలోనే అంజిరెడ్డి తన భార్యను అస్ట్రేలియాకు పంపించగా.. ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన రాజేశ్, రెండు దఫాలుగా పద్మారావునగర్ ఇంటి కోసం రూ. 2.1 కోట్ల నగదును చెల్లించినట్లు రూ. 50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చినట్లు డాక్యుమెంట్లు తయారు చేశాడు. తాను ముందుగా మేడ్చల్‌లో అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాను ఖరీదు చేయాలని, ఆ తరువాత తన ఇతర ఆస్తులను విక్రయిస్తానంటూ రాజేశ్‌తో మాట వరుసకు చెప్పాడు. గత నెల 29న రాజేశ్‌ను వెంటబెట్టుకొని అంజిరెడ్డి మేడ్చల్‌కు వెళ్లాడు. అక్కడ విల్లాను చూసి అస్ట్రేలియాలో ఉన్న భార్యతో చర్చించాడు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ కట్..
అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు మోకిల్లాలో ఉండే కొడుకు శ్రీచరణ్‌రెడ్డి అంజిరెడ్డికి ఫోన్ చేశాడు. ఒకసారి ఫోన్ రింగ్ అయ్యింది. ఆ తరువాత స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానంతో అతడి కుమారుడు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జీఆర్ కన్వెన్షన్‌లో ఉన్న డిమార్ట్ బిల్డింగ్ బేస్మెంట్లో అంజిరెడ్డి కారు పార్కు చేసి ఉండటం, ఆ పక్కనే అతడు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ముందుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి అంజిరెడ్డికి ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చింది. అయితే, పోలీసులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో అంజిరెడ్డిది హత్య అని తేల్చారు. రాజేశ్ తన భార్య, డ్రైవర్‌తోపాటు తన కన్వెన్షన్‌లో పనిచేసే ఇద్దరు బీహారీలతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

