Tollywood | మే ఫస్ట్ వీక్‌లో మూవీ ఫెస్ట్.. థియేటర్లలో యాక్షన్, కామెడీ, దేశభక్తి సినిమాల సందడి
Tollywood | సమ్మర్ సీజన్‌కు అసలైన కిక్ ఇవ్వడానికి మే మొదటి వారం థియేటర్లలో భారీ ఎంటర్టైన్మెంట్ సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు విభిన్న జానర్లలో సినిమాలు విడుదలకు రెడీ అవుతుండటంతో ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది. యాక్షన్ థ్రిల్లర్లు, పొలిటికల్ సెటైర్లు, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లు, దేశభక్తి కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.
Tollywood | సమ్మర్ సీజన్‌కు అసలైన కిక్ ఇవ్వడానికి మే మొదటి వారం థియేటర్లలో భారీ ఎంటర్టైన్మెంట్ సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు విభిన్న జానర్లలో సినిమాలు విడుదలకు రెడీ అవుతుండటంతో ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది. యాక్షన్ థ్రిల్లర్లు, పొలిటికల్ సెటైర్లు, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లు, దేశభక్తి కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.
ధనుష్ ‘కర’
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర’ ఈ వారం అందరి దృష్టిని ఆకర్షించే మూవీలలో ఒకటి. బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌లో ధనుష్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. వరుస హైస్ట్ల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న సస్పెన్స్ కథపై ఆసక్తిని పెంచుతోంది. ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. జివి ప్రకాష్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి స్పందన అందుకుంది.
‘గాయపడ్డ సింహం’తో తరుణ్ భాస్కర్ కొత్త ప్రయత్నం
దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ‘గాయపడ్డ సింహం’ ద్వారా హీరోగా వస్తున్నారు. అమెరికా నుంచి డిపోర్ట్ అయిన ఓ యువకుడు డొనాల్డ్ ట్రంప్‌పై యుద్ధం ప్రకటించే కథతో ఈ చిత్రం రూపొందింది. జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ఇప్పటికే వైరల్ అవుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సత్య ‘జెట్లీ’తో నవ్వుల హంగామా
కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ‘జెట్లీ’ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రాబోతోంది. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల పండుగగా నిలుస్తుందని టీజర్లు చెబుతున్నాయి.
లెజెండ్స్ కలిసి ‘పేట్రియాట్’
మలయాళ సినీ దిగ్గజాలు మోహన్ లాల్, మమ్ముట్టి దాదాపు పదమూడు ఏళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రం ‘పేట్రియట్’. నయనతార, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ కాస్ట్‌తో రూపొందిన ఈ దేశభక్తి కథ మే 1న విడుదల అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
సాయి పల్లవి హిందీ ఎంట్రీ
సాయి పల్లవి బాలీవుడ్లో అడుగుపెడుతున్న చిత్రం ‘ఏక్ దిన్’, తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో మే 1న విడుదల కానుంది. అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా పరిచయం అవుతున్నారు. అదే రోజున రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన ‘రాజా శివాజీ’ కూడా రిలీజ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంపై తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మొత్తంగా చూస్తే ఈ వారం థియేటర్లలో సినిమాల హడావిడి మామూలుగా లేదు. యాక్షన్, కామెడీ, పొలిటికల్ డ్రామా, దేశభక్తి, బయోపిక్.. ఇలా అన్ని జానర్లలో సినిమాలు ఒకేసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో, ఎవరు బ్లాక్‌బస్టర్ కొడతారో అనేది ఆసక్తికరంగా మారింది.
సినిమా ప్రియులకు ఇది సరైన సమయం.. మీకు నచ్చిన సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

