Ravi Teja 70 | రవితేజ 70వ సినిమాకు అదిరిపోయే టైటిల్
క్రాక్ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja).

ఈ ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాపీస్‌ను షేక్ చేశాడు టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja). ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రమేశ్ శర్మ, శరత్ మండవతోపాటు మరో డైరెక్టర్‌తో సినిమాలు లైన్లో పెట్టిన రవితేజ..తాజాగా తన 70వ (Ravi Teja 70) సినిమా కూడా ప్రకటించేశాడు. సుధీర్ శర్మ (Sudheer Varma) దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
‘హీరోలు ఉండరు’ (Heroes does not exist) అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన రవితేజ @70 ప్రాజెక్టుకు ‘రావణాసుర’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫైనల్ చేశారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. హీరోలు ఉండరు అని అంటే విలనే మెయిన్ అన్నమాట. సాధారణంగానే రావణాసురుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తి కావడంతో ఈ చిత్రానికి రావణాసుర టైటిల్‌ను ఫైనల్ చేశారని వార్తలు వస్తుండగా..మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ పతాకాలపై అభిషేక్నామాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పురాతన శిల్పాలతో ఆదివారం విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 5న విడుదలచేస్తామన్ని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. రవితేజ @70వ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథనందిస్తున్నాడు.
ఇది కూడా చూడండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

