Deva Katta | ఫ్లాప్ దర్శకుడి చేతిలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు
అదేంటో కొందరికి బోలెడంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాదు. అదృష్టం లేకో.. టైమ్ బ్యాడో తెలియదు కానీ ఎంత మంచి సినిమాలతో వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగులుతుంటాయి.
Deva Katta | అదేంటో కొందరికి బోలెడంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాదు. అదృష్టం లేకో.. టైమ్ బ్యాడో తెలియదు కానీ ఎంత మంచి సినిమాలతో వచ్చినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోతుంటారు. ప్రస్తుతం దర్శకుడు దేవాకట్టా పరిస్థితి కూడా అంతే ఉంది. ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దేవా తొలి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ‘ప్రస్థానం’ వంటి కల్ట్ సినిమా తీసి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కానీ కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం ప్రేక్షకులలో దేవాపై ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు.
దాంతో తన మూడో సినిమా ‘ఆటోనగర్ సూర్య’ పై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ ఫేయిల్యూర్‌గా మిగిలింది. కథ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా ఉన్నా కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ మూవీని తిరస్కరించారు. ఆ తర్వాత మంచువిష్ణుతో ‘డైనమైట్’ తెరకెక్కించి మరింత పాతాళానికి పడిపోయాడు. ఈ రెండు సినిమాలు దేవా కెరీర్‌ను వెనక్కి లాగేశాయి. ఆ తర్వాత ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ‘ప్రస్థానం’ సినిమాను హిందీలో తెరకెక్కించాడు. ఇది కూడా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇక ‘రిపబ్లిక్’తో మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. తీరా రిలీజయ్యాకా దేవా కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. సందేశంతో ముడిపడ్డ సినిమాలో కమర్షియల్ హంగులు పెద్దగా లేకపోవడం, పైగా ట్రాజిక్ ఎండింగ్ ఉండటంతో ప్రేక్షకులు సినిమాను తిప్పికొట్టారు. అయితే ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది.
ఇలా కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కించినా.. కమర్షియల్ డైరెక్టర్‌గా దేవా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే వరుసగా ఇన్ని ఫ్లాపులు వచ్చినా.. దేవా మాత్రం తీరిక లేకుండా కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడట. ఈ విషయాన్ని దేవానే స్వయంగా వెల్లడించాడు. తన చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్లున్నాయని చెప్పాడు. జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న ‘ఇంద్రప్రస్థం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ షోతో పాటు, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఒక భారీ కథ మీద వర్క్ చేస్తున్నట్లు దేవా తెలిపాడు. వీటితో పాటుగా మరో భారీ కథను కూడా వర్కవుట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇవన్నీ పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కుతున్నట్లు టాక్. ఇలా వరుస ఫ్లాపులు వచ్చినా.. దేవా కెరీర్ మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయల్లా కొనసాగుతుండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

