Tollywood | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ తెలుగు కమెడియన్ మృతి
Tollywood | టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై సమీపంలోని సిరుశేరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.
Tollywood | టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని చెన్నై సమీపంలోని సిరుశేరులోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. బుధవారం నాడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విశ్వేశ్వరరావు మరణవార్తతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.
ఏపీలోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. ఆయన కెరీర్లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. బాలనటుడిగానే 150 చిత్రాల్లో నటించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోలతో ఆయన నటించారు. ఆమె కథ, ముఠా మేస్త్రీ, బిగ్బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ వంటి చిత్రాలతో ఆయన గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు.
విశ్వేశ్వరరావు ఓ యూట్యూబ్ ఛానల్ను కూడా రన్ చేస్తున్నారు. విస్సు టాకీష్ పేరుతో నడిపిస్తున్న ఆ యూట్యూబ్ ఛానల్లో సినిమాలకు సంబంధించిన పలు విషయాలను ఆయన పంచుకున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితతో తాను పనిచేశానని.. ఇది తనకెంతో గర్వకారణమని ఆయన చెప్పుకునేవారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

