Sreeleela | పెళ్లి సందడి సినిమాతో కుర్రాళ్ల మనసుల్ని దోచుకుంది శ్రీలీల. ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకా సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వరుస ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్లో సెన్సేషన్‌గా మారింది. కానీ కొద్దిరోజులుగా ఆమెకు అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మెప్పించినా.. అది కూడా యావరేజ్‌గానే మిగిలింది. దీంతో కొద్దిరోజులు బ్రేక్ తీసుకుని స్టడీస్‌పై ఫోకస్ చేయాలని ఫిక్సయ్యింది శ్రీలీల. ఈ క్రమంలోనే భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ సింపుల్‌గా నో చెప్పేస్తుందట.
శ్రీలీల డ్యాన్సులకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అందుకే స్పెషల్ సాంగ్స్‌లో చేయాలని కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయించాలని మేకర్స్ భావించారు. ఇదే విషయమై శ్రీలీలను సంప్రదించి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. కానీ ప్రస్తుతం సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఐటెం సాంగ్స్ చేయడం శ్రీలీలకు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే కోట్లు ఇచ్చినా సరే ఐటెం సాంగ్స్ చేయనని శ్రీలీల చెప్పేసిందట. గతంలో పుష్ప 2 సినిమాలోనూ ఐటెం సాంగ్ కోసం అడిగితే రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తుంది. ఒకవైపు కెరీర్, మరోవైపు సినిమాలను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఇప్పుడు ఎంబీబీఎస్ పరీక్షలు ఉండటంతో శ్రీలీల సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అందుకే కొత్తగా వేరే సినిమాలను ఒప్పుకోవడం లేదు. ముందుగా ఒప్పుకున్న సినిమాలనే కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది.