Janhvi Kapoor | సూపర్ టైమింగ్.. కరెక్ట్ టైంలో అటాక్ మొదలు పెట్టిన జాన్వీ కపూర్..!
Janhvi Kapoor | తెలుగు ఇండస్ట్రీకి నెవర్ ఎండింగ్ ఇష్యూ ఒకటి ఉంది. అదే హీరోయిన్ల సమస్య. రోజుకు ఒక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న కూడా ఆ సమస్య మాత్రం ఎప్పుడూ నిత్య నూతనంగా అలాగే ఉంటుంది. ఇప్పటికీ ఆ ఇష్యూ అలాగే కంటిన్యూ అవుతుంది. అనుష్క, నయనతార కేవలం సీనియర్ హీరోలకు మాత్రమే పరిమితం అయిపోయారు.
Janhvi Kapoor | తెలుగు ఇండస్ట్రీకి నెవర్ ఎండింగ్ ఇష్యూ ఒకటి ఉంది. అదే హీరోయిన్ల సమస్య. రోజుకు ఒక కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న కూడా ఆ సమస్య మాత్రం ఎప్పుడూ నిత్య నూతనంగా అలాగే ఉంటుంది. ఇప్పటికీ ఆ ఇష్యూ అలాగే కంటిన్యూ అవుతుంది. అనుష్క, నయనతార కేవలం సీనియర్ హీరోలకు మాత్రమే పరిమితం అయిపోయారు. మరోవైపు సమంత, తమన్నా, రకుల్ వీళ్లందరితో మన హీరోలు ఆల్రెడీ ఒకటికి రెండుసార్లు నటించడంతో.. వాళ్లందరూ బాలీవుడ్‌పై ఫోకస్ చేశారు.. లేదంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. పైగా తెలుగులో వాళ్లకు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు.
అందుకే పక్క భాషలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పూజా హెగ్డే కూడా అంతే! రష్మిక మందన్నకు క్రేజ్ ఉన్నా కూడా ఆమె తెలుగు ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోవడం లేదు. కియారా అద్వానీ అప్పుడప్పుడు తెలుగులో నటిస్తోంది. అందుకే ఇప్పుడు తెలుగులోనే ఉండిపోయే ఒక హీరోయిన్ కావాలి. స్టార్ హీరోలందరూ అలాంటి హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చేస్తుంది జాన్వీ కపూర్. తెలుగు ఇండస్ట్రీ కోసం ఈమె సొంత ఇండస్ట్రీని ఏమి త్యాగం చేయడం లేదు. ఎందుకంటే ఆరేళ్లుగా అక్కడ సినిమాలు చేస్తున్న జాన్వీకి కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. అడపాదడపా సినిమాలు చేయడమే కానీ స్టార్ హీరోలు ఇప్పటివరకు జాన్వీ కపూర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే అమ్మ కోరిక నెరవేర్చడానికి సౌత్ ఇండస్ట్రీకి వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరీ ముఖ్యంగా శ్రీదేవి బతికున్నప్పుడు జాన్వీ కపూర్‌ను తెలుగులో స్టార్ హీరోయిన్ను చేయాలని బాగా ఆశ పడింది.
ఇప్పుడు భార్య కోరిక దగ్గరుండి తీరుస్తున్నాడు బోనీ కపూర్. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో జోడి కట్టిన జాన్వీ కపూర్.. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే రామ్ చరణ్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఖచ్చితంగా మరికొందరు హీరోల నుంచి జాన్వీ కపూర్‌కు అవకాశం రావడం ఖాయం. గతంలో సమంత, తమన్నా, రకుల్, పూజా హెగ్డే, శ్రీలీల విషయంలో ఇదే జరిగింది. ఒక్క స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే చాలు మిగిలిన వాళ్లందరూ ఆమె వైపు పరుగులు పెట్టడం టాలీవుడ్లో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు జాన్వీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏదేమైనా కరెక్టు టైమ్‌లో సూపర్ టైమింగ్‌తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

