Amritha Aiyer | అలా చేయడానికి ఇంకా సిద్ధంగా లేను.. అమృత అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Amritha Aiyer | అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటేనే విజయం వరిస్తుంది. వర్ధమాన నటి అమృత అయ్యర్‌కు ఈ మాట నూటికి నూరుశాతం వర్తిస్తుంది. చిట్టి చిత్రాల నుంచి వెండితెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీ నటిగా అవతరించింది. తాజాగా ఓ ద్విభాషా చిత్రంలోనూ కథానాయికగా చాన్స్ కొట్టేసింది.
Amritha Aiyer | అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటేనే విజయం వరిస్తుంది. వర్ధమాన నటి అమృత అయ్యర్‌కు ఈ మాట నూటికి నూరుశాతం వర్తిస్తుంది. చిట్టి చిత్రాల నుంచి వెండితెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీ నటిగా అవతరించింది. తాజాగా ఓ ద్విభాషా చిత్రంలోనూ కథానాయికగా చాన్స్ కొట్టేసింది. చురుకు చూపులతో కుర్రకారు మతిపోగొట్టే ఆ కండ్లకు ఏ హావభావాన్ని అయినా ప్రకటించే శక్తి ఉందని చాటుకుంటున్న అమృత అయ్యర్ అంతరంగం ఇది..
నేను పుట్టింది చెన్నైలో. పెరిగిందంతా బెంగళూరులో. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు అక్కడే సాగింది. డిగ్రీలో కామర్స్ నా మెయిన్ సబ్జెక్ట్. చదువు పూర్తి అయిపోయాక ఏడాదిపాటు ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను.
‘రెడ్’ సినిమా చేసేటప్పటికి.. నాకు తెలుగు అంతంత మాత్రమే వచ్చు! ఆ తర్వాత కష్టపడి బాగా నేర్చుకున్నా. ఇప్పుడు గలగలా మాట్లాడగలను. మాతృభాషే అనేంత స్పష్టంగా సంభాషిస్తున్నా. కాలేజీ రోజుల్లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా కాస్త మంచి సినిమా అనిపిస్తే చాలు చూసేదాన్ని.
చిన్నప్పటి నుంచి గ్లామర్ ఫీల్డ్ అంటే ఆసక్తి ఎక్కువ. ఇంట్లోవాళ్లు, స్నేహితులు కూడా ప్రోత్సహించారు. సినిమా అంటే ప్రాణం. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఆహార నియమాలు తప్పనిసరి. ఫిట్నెస్ కాపాడుకోవాలి. అలాగని జిమ్‌కు వెళ్లను. ఇంట్లోనే తేలికపాటి కసరత్తులు చేస్తాను. చిన్నప్పటి నుంచి బాస్కెట్‌బాల్ బాగా ఆడేదాన్ని. దాంతో నా ఫిట్నెస్ మెరుగ్గా ఉంది.
2012లో నా వెండితెర జర్నీ మొదలైంది. ‘పద్మవ్యూహం’ అనే మలయాళ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. తర్వాత నాలుగైదు చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాను. 2018లో ‘పదైవీరన్’తో కథానాయికగా పరిచయం అయ్యాను. అదే ఏడాది మరో రెండు అవకాశాలు వచ్చాయి. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
2021.. ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరం. ఆ ఏడాది నేను నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగులో నా మొదటి చిత్రం ‘రెడ్’. రామ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ఇక ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ నన్ను తెలుగువారికి మరింత దగ్గర చేసింది. ‘నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా..’ పాట అప్పట్లో ఎంత వైరల్ అయిందో తెలిసిందే కదా! సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాకు మంచి గుర్తింపు లభించింది. ‘అర్జున ఫల్గుణ’లో గుర్తుండిపోయే పాత్ర పోషించాను. ‘హనుమాన్’ సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే మరిన్ని ప్రకటనలు ఉంటాయి.
ఈ తరహా పాత్రలే చేయాలని గిరి గీసుకోలేదు. కథ, పాత్ర నచ్చితే ఓకే చెబుతాను. ఇప్పటి వరకు నేను పోషించిన పాత్రల్లో సంప్రదాయమైనవే ఎక్కువ. నేనేంటో నిరూపించుకునే అవకాశం ఇంకా రాలేదు అనుకుంటున్నా. చాలెంజింగ్ పాత్రలు పోషిస్తేనే నటిగా సంతృప్తి కలుగుతుంది. గ్లామర్ రోల్స్ కు ఇప్పటికైతే సిద్ధంగా లేను.
Read More :
“Amritha Aiyer | క్యూట్ లుక్‌లో అమృత అయ్యర్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

