Sunil | సునీల్ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా..!
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి సోలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు సునీల్ (Sunil). సోలో హీరోగా టైం వృథా చేయకుండా కొంత కాలంగా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న సునీల్ మళ్లీ లీడ్ రోల్ చేస్తూ కెరీర్ ను రిస్క్ లో పెడుతున్నాడని తెగ చర్చించుకుంటున్నారు టాలీవుడ్ ( Tollywood )జనాలు.

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి సోలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు సునీల్ (Sunil). అయితే హీరోగా నటించిన సినిమాల్లో సునీల్ బ్రేక్ ఇచ్చినవి తక్కువే. దీంతో సోలో హీరోగా చేస్తూ టైం వృథా చేయకుండా కొంత కాలంగా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం పలు పెద్ద చిత్రాల్లో కీ రోల్స్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరోవైపు అంజి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మేకర్స్ ‘బుజ్జి ఇలా రా’ (Bujji Ila Ra) టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ సినిమాలో కమెడియన్ ధన్ రాజ్ మరో లీడ్ రోల్ చేస్తుండగా..చాందిని తమిళరసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంజి పీఎస్వీ గరుడవేగ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. ఈ చిత్రానికి జీ నాగేశ్వర్ రెడ్డి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే సపోర్టింగ్ క్యారెక్టర్లతో సక్సెస్ ఫుల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న క్రమంలో సునీల్ మళ్లీ ఇలాంటి సినిమా చేసి తన కెరీర్ ను రిస్క్ పడేస్తాడా..? అంటూ సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు.
కమెడియన్ గా కనిపించడం మానేసి హీరోగా మారిన తర్వాత సునీల్ కెరీర్ సైడ్ ట్రాక్ అయిన విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ బాగానే ఉన్న ఇలాంటి టైంలో మళ్లీ లీడ్ రోల్ చేయడం సునీల్ కు ఎంత వరకు కలిసొస్తుందోనని గోళ్లు గిల్లుకుంటున్నారు. సినీ లవర్స్.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

