Avatar-2 | అవతార్-2 మాటల రచయితగా టాలీవుడ్ యంగ్ దర్శకుడు..!
సముద్ర గర్భంలో జేమ్స్ కామెరూన్ ఈ సారి ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అవతార్-2 టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Avatar-2 Movie Telugu Dialogue writer | ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘అవతార్-2’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల మందుకు రానుంది. ఎప్పుడెప్పుడు డిసెంబర్ 16 వస్తుందా అని ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. సముద్ర గర్భంలో జేమ్స్ కామెరూన్ ఈ సారి ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 160 దేశాల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ తెలుగు భాషలోనూ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
కాగా తెలుగులో ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ మాటలు అందించాడట. నటుడిగా, దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ టాలీవుడ్‌కు సుపరిచితమే. ఇటీవలే రిలీజైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో డా.వరుణ్ పాత్రలో నటించాడు. కాగా శ్రీనివాస్‌కు అవతార్ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం రావడం విశేషం అనే చెప్పాలి. ఇటీవలే వచ్చిన ‘బ్రహ్మస్త్ర’ తెలుగు వెర్షన్‌కు కూడా ఆయనే మాటలు రాశాడు. ఈయన సినిమాల్లోని డైలాగ్స్ సరదాగా, మన దగ్గరి వాళ్ళతో మాట్లాడే విధంగా ఉంటాయి. అవతార్‌కు కూడా అదే విధంగా డైలాగ్స్ రాసి ప్రేక్షకులను మెప్పిస్తాడని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాగశౌర్యతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే రోమ్కామ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇక అవతార్-2 సినిమా రిలీజ్‌కు ముందే వండర్స్ క్రియేట్ చేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమాకు కోట్లలో కలెక్షన్లు వస్తున్నాయి. అవతార్-2 టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం పీవీఆర్, సినీ పోలిస్, ఐనాక్స్ వంటి మల్టీ ప్లెక్స్‌లలో ఇప్పటి వరకు దాదాపు మూడున్నర లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే అవతార్ కోసం ప్రేక్షకులు ఎంత ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఇక్కడ రిలీజ్ కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

