Bimbisara Movie | ‘బింబిసార’ కథను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Bimbisara Movie | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘బింబిసార’ హవా నడుస్తుంది. ‘పటాస్’ తర్వాత దాదాపు ఏడేళ్ళకు కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంతో కమర్షియల్ హిట్‌ను సాధించాడు. ఈయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌కు, పాత్రలను మలిచిన విధానంకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ముందుగా ఈ కథ ఓ స్టార్ హీరో దగ్గరకు వెళ్ళిందట. కానీ ఆయన రిజెక్ట్ చేశాడట.
ఇంతకీ ఎవరా? స్టార్ హీరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు మాస్‌రాజా రవితేజ. దర్శకుడు వశిష్ఠ ముందుగా ఈ కథను రవితేజకు చెప్పాడట. అయితే రవితేజకు కథ బాగా నచ్చిందట. కానీ ఆ పాత్రకు తను సూట్ కానని రిజెక్ట్ చేశాడట. దాంతో ఈ కథ కళ్యాణ్‌రామ్ వద్దకు చేరిందట. ముందుగా కళ్యాణ్‌రామ్ కూడా ఈ పాత్రలో తను సూట్ అవుతానో లేదో అని సందిగ్థంలో పడ్డాడట. అయితే బింబిసారి లుక్ టెస్ట్ జరిపి ఆ ఫోటోలను ఎన్టీఆర్‌కు పంపాడట. తారక్ నుండి మంచి కాంప్లిమెంట్ రావడంతో కళ్యాణ్‌రామ్‌కు ధైర్యం వచ్చిందట. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరిన్ ట్రెసా, సంయుక్తమీనన్లు నటించారు. శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్రలో నటించాడు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పటికే 9కోట్ల వరకు ప్రాఫిట్లను దక్కించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

