Bimbisara Movie | బింబిసారుడిపై పుష్ప రాజ్ ప్రశంసలు.. బన్నీ ట్వీట్ వైరల్
Allu Arjun Praises Bimbisara Team | ప్రస్తుతం టాలీవుడ్లో బింబిసారుడి హవా కొనసాగుతుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుంది. పటాస్ తర్వాత దాదాపే ఏడెళ్ళకు కళ్యాణ్‌రామ్‌కు ఆ స్థాయిలో బింబిసార విజయం సాధించింది. అంతేకాకుండా ఈ చిత్రం కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను తీసుకొచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ.13 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఆదివారంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని లాభాల బాట పట్టనుంది. ఈ చిత్రంలో బింబిసారుడిగా కళ్యాణ్‌రామ్ నటన వర్ణనాతీతం. స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ విజయంపై పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా అల్లుఅర్జున్ చిత్రబృందాన్ని ట్విట్టర్లో అభినందించాడు.
లేటస్ట్‌గా అల్లుఅర్జున్ ఈ చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియా ద్వారా మేకర్స్‌ను అభినందించాడు. ‘బింబిసార టీమ్‌కు బిగ్ కంగ్రాట్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఫాంటసీ చిత్రం. కళ్యాణ్‌రామ్ గారు ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఎప్పుడూ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తున్నందుకు, కొత్త తరహా సినిమాలను చేస్తున్నందుకు ఆయనంటే నాకు చాలా గౌరవం. డెబ్యూ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని చక్కగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రానికి పనిచేసిన కీరవాణి గారు, కేథరీన్ ట్రేసా, సంయుక్త మీనన్‌లకు అభినందనలు. ప్రతీ వయసు వారికి బింబిసార ఒక ఎంటర్టైన్మెంట్’అంటూ బింబిసార టీమ్‌ను అభినందించాడు.
I appreciate the debut dir @DirVassishta for handling it well . Commendation to all the technicians & artists . @mmkeeravaani garu @CatherineTresa1 @iamsamyuktha_ . @NTRArtsOfficial . Bimbisara : An entertainment for all age groups
— Allu Arjun (@alluarjun) August 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

