Tiger Shorff | అడివిశేష్ ‘గూఢచారి’ కథతో టైగర్ ష్రాఫ్.. ఆకట్టుకుంటున్న ‘హీరోపంటి-2’ ట్రైలర్
బాలీవుడ్లో వరుస సినిమాలలో నటిస్తూ ప్రతి సినిమాకు విభిన్న వేరియేషన్స్ చూపిస్తూ బాలీవుడ్ సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు టైగర్ ష్రాఫ్.
Heropanty-2 Trailer | బాలీవుడ్లో వరుస సినిమాలలో నటిస్తూ ప్రతి సినిమాకు విభిన్న వేరియేషన్స్ చూపిస్తూ బాలీవుడ్ సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు టైగర్ ష్రాఫ్. ఈయన యాక్షన్ ఎపిసోడ్స్‌కే ప్రత్యేకంగా అభిమానులుంటారు. సినిమాలలో ఈయన చేసిన విధంగా యాక్షన్ సన్నివేశాలు మరెవరూ చేయలేరెమో అనిపిస్తుంది. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘హీరోపంటి-2’. ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది.
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రం 2014లో వచ్చిన ‘హీరోపంటి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. తెలుగులో బన్నీ నటించిన ‘పరుగు’ సినిమను ‘హీరోపంటి’గా రీమేక్ చేసారు. ఈ చిత్రంతోనే టైగర్ ష్రాఫ్ సీనిరంగంలోకి తెరంగ్రేటం చేశాడు. అప్పట్లో ఈ చిత్రం దాదాపు 55 కోట్ల కలెక్షన్లను సాధించింది. డెబ్యూగా టైగర్ ష్రాఫ్‌కు మంచి ఊపునిచ్చింది. ఈ చిత్రంలో తన డాన్స్, యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళ్ళీ 8ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. ఈ చిత్రం కూడా అడివిశేష్ ‘గూఢచారి’ సినిమా కథను బేస్ చేసుకుని తెరకెక్కించారు.
తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఇప్పటివరకు టైగర్ ష్రాఫ్ సినిమాలలో ఉండే యాక్షన్‌కు రెట్టింపు యాక్షన్ ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. నవాజుద్దీన్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో టైగర్‌కు జోడిగా తారా సుతారియా హీరోయిన్గా అందించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిసజిద్ నడియావాలానిర్మించాడు. ఈద్ సందర్భంగా ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది.
Babloo dhundne se nahi…
Qismat se milta hain.. 💯Aur aapki qismat hain achi kyuki aarha hoon mai milne aapse iss Eid #SajidNadiadwala‘s #Heropanti2
Directed by @khan_ahmedasas
Trailer out Now💥⬇️https://t.co/k7uVb7bpDz— Tiger Shroff (@iTIGERSHROFF) March 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

