Tiger Nageswara Rao Movie Review | ధమాకా వంటి వంద కోట్ల సినిమా తర్వాత రావణాసుర రిజల్ట్ తేడా కొట్టడంతో రవితేజ కాస్త నిరాశపడ్డాయి. పడిన దగ్గరే లేవాలి అనే విధంగా టైగర్ నాగేశ్వరరావుతో ఎలాగైన కంబ్యాక్ ఇవ్వాలని కసితో సినిమా చేశాడు. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు కావాల్సిన హైప్ అదే వచ్చింది. పైగా ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలియడంతో అందరిలోనూ సినిమాపై అమితాసక్తి నెలకొంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్తో ఎదురు చూశారు.
ఫస్ట్ ఆఫ్:
కాగా శుక్రవారం ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు వాళ్ల వాళ్ల సమీక్షలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ కుమ్మేశాడట. సినిమాలో రవితేజ ఎంట్రీ అయితే వేరే లెవల్ అని అంటున్నారు. అయితే వీఎఫ్ఎక్స్ మాత్రం పేలవంగా ఉన్నాయిని, వాటి మీద కొంచెం శ్రద్ద పెట్టుండే బాగుండేదని అంటున్నారు. ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం రచ్చ రచ్చ చేసిందట. స్టార్టింగ్ నుంచి ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ వరకు నిమిషం కూడా బోర్ కొట్టించకుండా దర్శకుడు వంశీ ఫస్ట్ ఆఫ్ బాగా హ్యాండిల్ చేశాడట.
సెకండ్ ఆఫ్:
అయితే సెకండ్ ఆఫ్ మాత్రం ఫస్ట్ ఆఫ్ రేంజ్లో లేదని.. వంశీ సెకండ్ ఆఫ్‌లో తడబడ్డాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా సెకండ్ ఆఫ్ చాలా లాగ్ ఉందని, కొన్ని సీన్లు బోర్ తెప్పిచ్చాయని అంటున్నారు. అయితే మళ్లీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి సినిమా పుంజుకుందని వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు గజదొంగలా మారడానికి కారణాలేంటని చెప్పే సీన్లు అంతగా కనెక్ట్ కాలేవట. సెకండ్ ఆఫ్‌ను ఓపికగా చూడాల్సి వస్తుందని అంటున్నారు. ఇక సినిమాలో మరో బిగ్గెస్ట్ డిసప్పాయింట్ లవ్ ట్రాక్ అంట. సినిమాలో వచ్చే లవ్ సీన్స్‌కు అస్సలు కనెక్ట్ కాలేమట. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అట. సాధారణ ఆడియెన్స్‌కు హాఫ్ మీల్స్ అట.
ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫి గురించేనట. ఆర్.మాది తన కెమెరా వీజువల్స్తో ప్రేక్షకులను కొత్త ప్రపంచలోకి తీసుకెళ్లాడట. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ బ్యాక్గ్రాండ్ మ్యూజిక్ మాత్రం ఇరగ్గోట్టేశాడట. కొన్ని సీన్లకు తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడట. అయితే పాటలు మత్రం గాలికి వదిలేశాడట. ఒక్కటంటే ఒక్క పాట కూడా వినడానికి.. చూడడానికి అంత బాగా లేవట. ఇక ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు కత్తెరకు ఇంకా పని పెట్టాల్సి ఉండేదని చెబుతున్నారు. చివరిగా ఇలాంటి సబ్జెక్ట్ కోసం కోట్లు ఖర్చుపెట్టిన అభిషేక్‌ను ఖచ్చితంగా అభినందించాల్సిందేనని అంటున్నారు. సినిమాను చాలా రిచ్‌గా హైస్టాండర్డ్‌లో తీశారట.
ఇది కేవలం ట్విట్టర్ నుంచి తీసుకున్న రివ్యూలు మాత్రమే. ఇక సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఒరిజినల్ రివ్యూ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.