Tiger Nageswara Rao Movie | సలార్ డేట్‌ను ఎగరేసుకుపోయిన టైగర్ నాగేశ్వరరావు..!
Tiger Nageswara Rao Preponed | అధికారికంగా ప్రకటన రాలేదు కానీ సలార్ నవంబర్ నెలకు పోస్ట్ పోన్ అయినట్లు బుక్ మై షోలో చూపిస్తుంది. డేట్ ఏంటా అన్నది మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.
Tiger Nageswara Rao Preponed | అధికారికంగా ప్రకటన రాలేదు కానీ సలార్ నవంబర్ నెలకు పోస్ట్ పోన్ అయినట్లు బుక్ మై షోలో చూపిస్తుంది. డేట్ ఏంటా అన్నది మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఇక సలార్ వాయిదా కానుండంతో పలు సినిమాలు అదే డేట్‌కు అటు ఇటు ఖర్చీఫ్ వేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో రవన్న నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా సలార్ డేట్ పైనే కన్నేసింది. ముందుగా దసరా బరిలో నిలవాలని అనుకున్నా.. ఇప్పటికే గంపగుత్తగా రిలీజ్లు ఉండటంతో ముందుకు జరిగింది. సలార్ రిలీజ్ డేట్‌కు ఒక రోజు వెనక్కి వచ్చి సెప్టెంబర్ 28న లాక్ చేసుకుంది.
ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
#TigerNageswaraRao 🥷 is ready to poach the Box Office 🐅
HUNTING WORLDWIDE FROM
SEP 28th 2023 🔥🔥@DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa @MayankOfficl pic.twitter.com/09oOvwwleo— Abhishek Agarwal 🇮🇳 (@AbhisekOfficl) September 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

