Tiger Nageshwara Rao Movie | టైగర్ నాగేశ్వరరావు మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!
Tiger Nageshwara Rao Songs | రవితేజ హీరోగా చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని రవన్న ఫ్యాన్స్‌తో పాటు అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు.
Tiger Nageshwara Rao Songs | రవితేజ హీరోగా చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని రవన్న ఫ్యాన్స్‌తో పాటు అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ముందుగా దసరాకు రిలీజ్ అనుకున్నా.. సలార్ తప్పుకోవడంతో ఇదే నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందట. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్లు గట్రా సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఇవన్నీ నెల రోజుల్లో చేస్తామా అనే డౌట్ పడుతున్నారట చిత్ర యూనిట్.
ఇప్పటకే సెప్టెంబర్ 28 రిలీజ్ అంటూ ప్రకటించినా.. ఆ రోజున ఖచ్చితంగా వస్తుందన్న సంకేతాలైతే లేవని ఇన్సైడ్ టాక్. ఇక రిలీజ్ డేట్ పక్కన పెడితే.. మేకర్స్ అప్పుడే ప్రమోషన్ల వేటను ప్రారంభించారు. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమోను లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ఏక్ ధమ్ ఏక్ ధమ్ అంటూ సాగే మెలోడియస్ పాట ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో మంగళవారం రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కింది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు అనే గజదొంగ ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

