Tiger Nageshwara Rao Movie | టైగర్ నాగేశ్వరరావు నుంచి మెలోడియస్ సాంగ్ రిలీజ్..!
Tiger Nageshwara Rao Movie | మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీవుతుందా అని రవన్న ఫ్యాన్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు
Tiger Nageshwara Rao Movie | మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీవుతుందా అని రవన్న ఫ్యాన్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లన్నీ వేరే లెవల్లో ఉన్నాయి. ఇక జీవి ప్రకాష్ స్వర పరిచిన పాటలు సైతం ఇన్‌స్టాంట్‌గా ఎక్కేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఇచ్చేసుకుంటాలే అంటూ సాగే మెలోడియస్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. భాస్కర్‌భట్ల స్వర పరిచిన ఈ పాటను సింధూరి ఆలపించింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

