Tiger 3 | టైగర్ ప్రాంఛైజీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో ఇప్పుడు టైగర్ 3 (Tiger 3) రాబోతుంది. మనీశ్ శర్మ (Manish Sharma) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్డేట్ వచ్చేసింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు తెలుస్తుంది. అలాగే సినిమా రన్ టైం విషయానికి వస్తే.. 157 నిమిషాలు (2 గంటల 33 నిమిషాల 38 సెకండ్స్) ఉన్నట్లు టాక్. కాగా దీనిపై మేకర్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. టైగర్ 3 మాస్ కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది.
#TIGER3 pic.twitter.com/T6Lzsqc2Gd
— Aakashavaani (@TheAakashavaani) November 2, 2023
యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.