Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘టైగర్ 3’ (Tiger 3). మనీశ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే సల్మాన్ ఖాన్ టైగర్ ప్రాంఛైజీలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే జోనర్లో ‘టైగర్ 3’ (Tiger 3) వచ్చింది. ఇక ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ వంటి భారీ డిజాస్టార్ తర్వాత ఈ మూవీ రావడంతో గ్లోబల్‌గా, దేశీయంగా కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటివరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.460 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక థియేటర్లో అలరించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా డిసెంబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.
#Tiger3 digital arrives December 31 on Prime Video.
Starring – Salman Khan, Katrina Kaif & Emraan Hashmi.#Tiger3OnPrime pic.twitter.com/EjQb0FRseH
— Ott Updates (@Ott_updates) December 13, 2023