Tiger 3 | సల్మాన్ ఖాన్ టీంకు ప్రేక్షకుల రిక్వెస్ట్.. టైగర్ 3 మేకర్స్ కీలక నిర్ణయం
Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీలో నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. హై బడ్జెట్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓపెనింగ్ రోజు వేకువ జామున 7 గంటలకు స్పెషల్ షోలు వేయనున్నట్టు ప్రకటించారు. థ్రిల్ రైడ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు సినిమా టికెట్ ప్రీ సేల్స్‌ను నవంబర్ 5న మొదలుపెట్టనున్నట్టు యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) ప్రకటించింది. టైగర్ 3 మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఆఫ్రికా దేశాల్లో నవంబర్ 11న విడుదల కానున్నట్టు తెలియజేస్తూ.. మరో లుక్ లాంఛ్ చేశారు మేకర్స్.
పులి గాయపడింది.. అంటూ షూటింగ్ టైంలో అప్డేట్ ఇచ్చి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు సల్లూభాయ్.టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలనాటి అందాల తార రేవతి లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి సల్మాన్ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది. టైగర్ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయని తెలిసిందే. దే ప్రాంఛైజీలో వస్తున్న సినిమా కావడంతో టైగర్ 3పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Get ready to book your 1st day 1st show tickets of #Tiger3 from 7 AM in India 🔥🔥🔥
Advance Bookings open on Sunday, 5th Nov across India 🔥
Tiger 3 is the next chapter of the interconnected #YRFSpyUniverse which unleashes in cinemas worldwide on Sun 12 Nov, 2023 [#Diwali2023]… pic.twitter.com/yKmyNe7BSc— Yash Raj Films (@yrf) November 1, 2023
#Tiger3 is coming to roar on 11th Nov, 9 PM IST onwards in Middle East, North America, UK & Europe and Africa! #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/q3XnG6NDQg
— Yash Raj Films (@yrf) November 1, 2023
టైగర్ 3 ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

