Tiger 3 Box Office | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఈ స్టార్ హీరో టైగర్ ప్రాంఛైజీలో నటించిన చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కత్రినాకైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. టైగర్ 3 దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది.
టైగర్ 3 రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. ఇంతకీ విషయమేంటంటే సల్లూభాయ్ కెరీర్లో రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన 17వ సినిమాగా నిలిచింది. ఏ ఇండియన్ స్టార్ హీరో నమోదు చేయని అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు సల్లూభాయ్. మూడు రోజుల్లో ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టిన సల్లూభాయ్ మరి రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రల్లో నటించారు. టైగర్ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వస్తున్న సినిమా కావడంతో టైగర్ 3ను ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టైగర్ 3 ఐమాక్స్ ఫార్మాట్లో కూడా విడుదలైంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
టైగర్ 3 అరుదైన రికార్డు..
#Tiger3 becomes #SalmanKhan‘s 17th consecutive 100cr Grosser, Highest for any Indian star🔥. #KatrinaKaif #Tiger3BoxOffice pic.twitter.com/fyRaOcy6C0
— MASS (@Freak4Salman) November 14, 2023
టవల్ సీన్ మేకింగ్ స్టిల్స్..
#KatrinaKaif Towel fight Scene gonna Blow Your Mind … 💥 💥 #Tiger3
Hottest Action Scenes Ever. 🥵🔥
Katrina towel fight hottest scene will turn theaters into stadium 🤤🥵🔥#SalmanKhan #Tiger3Diwali2023#EmraanHashmi #Katrina #Tiger3FirstDayFirstShow #FDFS pic.twitter.com/UfwFSA4ife
— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) November 6, 2023
Get ready to book your 1st day 1st show tickets of #Tiger3 from 7 AM in India 🔥🔥🔥
Advance Bookings open on Sunday, 5th Nov across India 🔥
Tiger 3 is the next chapter of the interconnected #YRFSpyUniverse which unleashes in cinemas worldwide on Sun 12 Nov, 2023 [#Diwali2023]… pic.twitter.com/yKmyNe7BSc— Yash Raj Films (@yrf) November 1, 2023
#Tiger3 is coming to roar on 11th Nov, 9 PM IST onwards in Middle East, North America, UK & Europe and Africa! #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/q3XnG6NDQg
— Yash Raj Films (@yrf) November 1, 2023
టైగర్ 3 ట్రైలర్..