Thunivu | తునివు అరుదైన రికార్డు.. అజిత్ కెరీర్లోనే తొలిసారి
తమిళనాడులో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న తునివు ఓవర్సీస్లో కూడా తనదైన ట్రెండీ టాక్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. అజిత్ కుమార్ కెరీర్లోనే ఇలాంటి అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి సినిమాగా తునివు నిలిచింది.
స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం తునివు (Thunivu). హెచ్ వినోథ్ (H Vinoth) డైరెక్షన్లో ఏకే 61 మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో తెగింపు టైటిల్‌తో విడుదలైంది. తమిళనాడులో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న తునివు ఓవర్సీస్లో కూడా తనదైన ట్రెండీ టాక్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
నార్త్ అమెరికా రీజియన్ (ఉత్తరమెరికా)లో ప్రతిష్టాత్మక 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరిపోయింది తునివు. అజిత్ కుమార్ కెరీర్లోనే ఇలాంటి అరుదైన రికార్డు నెలకొల్పిన తొలి సినిమాగా తునివు నిలిచింది. సాధారణంగా అజిత్ సినిమాలకు ఉత్తరమెరికా ప్రాంతంలో అంతగా బిజినెస్ ఉండదు. కానీ తునివు ఎవరూ ఊహించని విధంగా అరుదైన మార్క్‌ను చేరుకుని వార్తల్లో నిలిచింది. విజయవంతంగా ప్రదర్శించబడుతూ మిలియన్ డాలర్ మార్క్‌ను చేరుకున్న సందర్భాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు అజిత్ అభిమానులు, ఫాలోవర్లు.
రానున్న రోజుల్లో తునివు ఇంకెన్ని రికార్డులు సృష్టించబోతుందో చూడాలి మరి. ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. తునివు చిత్రాన్ని జీస్టూడియోస్-బోనీకపూర్ సమర్పణలో బోనీకపూర్ నిర్మించారు. మంజు వారియర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. సంజయ్ దత్, సముద్రఖని, మహానంది శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తునివు అరుదైన రికార్డు..
#Thunivu joins the coveted $1 Million club in North America.. 🔥
A first for #AK 👏 pic.twitter.com/sHPIpqqhRB
— Ramesh Bala (@rameshlaus) January 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

