Missing Movie : అదృశ్యం అయితే…

హర్ష నర్రా, నిఖిషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరిరావు నిర్మిస్తున్నారు. శ్రీని జోస్యుల దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. నగరంలో కొంతమంది యువతీయువకులు అనూహ్యంగా అదృశ్యమైపోతుంటారు. ఆ మిస్సింగ్స్ వెనకున్న రహస్యాన్ని ఓ యువకుడు ఎలా ఛేదించాడన్నది ఉత్కంఠను పంచుతుంది. ప్రస్తుతం నాయకానాయికలపై ప్రమోషనల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. కథాబలమున్న మంచి సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉందని హీరోహీరోయిన్లు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

