నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. బాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా వరుస ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు హిందీలోను క్రేజ్ పెరిగింది. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ అమ్మడి వెనుక పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే సమంత తాప్సీ ప్రొడక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ వారు సమంతకి ఒక భారీ ఆఫర్ ఇచ్చారట. తమ బ్యానర్లో మూడు సినిమాలు చేయవలసి ఉంటుందనే డీల్ ను ఆమె ముందుంచారట. అందుకు సమంత అంగీకరించిందని అంటున్నారు. మూడు సినిమాల మీద సమంతకు ముట్టే పారితోషికం భారీస్థాయిలో ఉందని చెప్పుకుంటున్నారు. మరి బాలీవుడ్లో అంత మంది హీరోయిన్స్ ఉండగా, సమంత వెనక వారు పడడం వెనక కారణమేంటా అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
అయితే సమంత సినిమాలు .. ఐటమ్ సాంగులు .. వెబ్ సిరీస్ లు దేనినీ వదిలేది లేదు అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఆమె ‘పుష్ప’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఒక స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తొలిసారి సమంత స్పెషల్ సాంగ్ చేస్తుండడంపై అందరి దృష్టి పుష్ప సినిమాపై ఉంది. కాగా, సమంత నటించిన శాకుంతలం చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, త్వరలో విడుదల కానుంది.