Telugu Movies | ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఏకంగా 13 సినిమాలు విడుదల
This Week Theater/Ott Movies | టాక్ సంగతి అటుంచితే గతవారం 'ఆదిపురుష్' హవానే నడిచింది. దాదాపు రెండు నెలల తర్వాత థియేటర్లో పెద్ద సినిమా రిలీజవడం.. అందులోనూ రామాయణం వంటి గొప్ప కథ రానుండటంతో తిరుగులేని హైప్ నెలకొంది.
This Week Theater/Ott Movies | టాక్ సంగతి అటుంచితే గతవారం ‘ఆదిపురుష్’ హవానే నడిచింది. దాదాపు రెండు నెలల తర్వాత థియేటర్లో పెద్ద సినిమా రిలీజవడం.. అందులోనూ రామాయణం వంటి గొప్ప కథ రానుండటంతో తిరుగులేని హైప్ నెలకొంది. రిలీజయ్యాక నెగెటివ్ రివ్యూలు జోరందుకున్నా.. కలెక్షన్లు మాత్రం వీర లెవల్లో వచ్చాయి. తొలిమూడు రోజుల్లోనే మూడోందల నలభై కోట్లు కలెక్ట్ చేసి ఆహా అనిపించింది. ఇక సోమవారం నుంచి ఈ సినిమా పూర్తిగా డల్ అయిపోయింది. ఇక ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తే గనుకు మరో రెండు వారాల వరకు మరో సినిమా ఊసే ఉండేది కాదు. కాగా ఆదిపురుష్ జోరు తగ్గడంతో ఈ వారం రిలీజ్‌కు చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఇక ఈ వారం ప్రేక్షకులను కనివిందు చేయడానికి బోలెడన్ని సినిమాలు ముస్తాబవుతున్నాయి. థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ పలు బ్రహ్మండమైన సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.
థియేటర్లో రిలీజయ్యే సినిమాలు:

ధూమమ్:
పుష్పతో తెలుగు ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఫాహద్ ఫాజిల్. ఆయన హీరోగా ధూమమ్ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు మంచి హైప్‌నే తెచ్చిపెట్టింది. కాగా ఈ సినిమా జూన్ 23న విడుదల కాబోతుంది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళీ హీరోయిన్గా నటించింది.

మనుచరిత్ర:
శివ కందుకూరి హీరోగా భరత్ పెద్దగాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వారం రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కాస్త మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సుహాస్, ధనంజయ వంటి స్టార్కాస్ట్ ఈ సినిమాలో నటించారు. గోపి సుందర్ స్వరాలందించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది.
వీటితో పాటుగా భారీతారాగణం, 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్(హిందీ) సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:

ఆహా:
ఇంటింటి రామాయణం-జూన్ 23

సోనీలివ్:
ఏజెంట్ (తెలుగు)- జూన్ 23

జీ5:
కిసీకా భాయ్ కిసీకీ జాన్ (హిందీ)- జూన్ 23

అమెజాన్ ప్రైమ్ వీడియో:
టీకూ వెడ్స్ షేరు(హిందీ)-జూన్ 23
మళ్లీ పెళ్లి-జూన్ 23
నెట్‌ఫ్లిక్స్:
గ్లామరస్ (ఒరిజినల్ సిరీస్)-జూన్ 21
స్లీపింగ్ డాగ్ (వెబ్‌సిరీస్)- జూన్ 22
సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్) -జూన్ 22
ఐ నంబర్ (హాలీవుడ్)- జూన్ 23

డిస్నీ+హాట్‌స్టార్:
క్లాస్ ఆఫ్ 09 (వెబ్‌సిరీస్)- జూన్ 19
సీక్రెట్ ఇన్వేషన్ (వెబ్‌సిరీస్) -జూన్ 21
ది కేరళ స్టోరీ (హిందీ) -జూన్ 23
వరల్డ్స్ బెస్ట్ (హాలీవుడ్) -జూన్ 23
లయన్స్ గేట్ ప్లే:
జాన్ విక్ (హాలీవుడ్)- జూన్ 23
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

