‘ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతుంటే కష్టం మొత్తం దూదిపింజలా ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు నిర్మాత భవాని కాసుల. తను నిర్మించిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్రా’ చిత్రం ఇటీవలే విడుదలైంది.
అభినవ్ గోమఠం, వైశాలీరాజ్ హీరోహీరోయిన్లు. తిరుపతిరావు ఇండ్ల దర్శకుడు. ఈ సినిమా థ్యాక్స్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు. రోజురోజుకీ సినిమాకు ఆదరణ పెరుగుతున్నదని దర్శకుడు చెప్పారు. విడుదలకు ముందు కాస్తంత టెన్షన్ ఉండేదని, ఫలితం తెలిశాక రిలాక్స్‌గా ఉందని అభినవ్ గోమఠం అన్నారు.