మైలురాయిలాంటి సినిమా
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ కథని జంగిల్, రాబిట్, లయన్.. అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. జంగిల్ బుక్ తీస్తున్నాడేమో నా వాయిస్ కోసం వచ్చాడని అనుకున్నా. తర్వాత అసలు కథ చెప్పాడు. స్టోరీ అదిరిపోయింది. ఇంత అద్భుతమైన కథ ఇచ్చిన ఈశ్వర్‌కి థ్యాంక్స్. చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తా.
దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ కథని జంగిల్, రాబిట్, లయన్.. అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. జంగిల్ బుక్ తీస్తున్నాడేమో నా వాయిస్ కోసం వచ్చాడని అనుకున్నా. తర్వాత అసలు కథ చెప్పాడు. స్టోరీ అదిరిపోయింది. ఇంత అద్భుతమైన కథ ఇచ్చిన ఈశ్వర్‌కి థ్యాంక్స్. చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తా. నా కెరీర్‌కి ఇది మైలురాయిలా నిలిచే సినిమా.’ అని హీరో సత్యదేవ్ నమ్మకం వెలిబుచ్చారు. సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ లీడ్ రోల్స్ చేసిన సినిమా ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.రెడ్డి, ఎస్.పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. సోమవారం హీరో నాని ఈ సినిమా టీజర్‌ని ఆన్లైన్లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యదేవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మంచు మనోజ్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. దర్శకుడు ఈశ్వర్ అంకితభావంతో చేసిన సినిమా ఇదని, ఆడియన్స్ మంచి సినిమా చూడబోతున్నారని నటుడు డాలీ ధనుంజయ చెప్పారు. మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఇంకా సత్యరాజ్, హీరోయిన్ జెన్నిఫర్ పిసినాటో, నిర్మాతలు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

