ఈ వారం థియేటర్లలో విడుదలకానున్న సినిమాలు ఇవే..
Upcoming movies | థియేటర్ల వద్ద మళ్లీ సినిమాల పండుగ కనిపిస్తోంది.
Upcoming movies | థియేటర్ల వద్ద మళ్లీ సినిమాల పండుగ కనిపిస్తోంది. కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో వాయిదా పడ్డ సినిమాలతో పాటు కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో గత వారం నాలుగైదు సినిమాలు విడుదలయ్యాయి. ఈ వారం మరో నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..
ఖిలాడి:
మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవి ఖిలాడి. రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది.
సెహరి:
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా సెహరి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ, జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
డీజే టిల్లు:
సిద్దూ జొన్నలగడ్డ, నేహాశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రానికి స్వయంగా సిద్దూ డైలాగ్స్ రచయితగా పనిచేశాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది.
ఎఫ్ఐఆర్:
విష్ణువిశాల్, మంజిమా మోహన్ ప్రాధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ఎఫ్ఐఆర్. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలను పెంచుతుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రానికి మాస్‌రాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

