ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..

ప్రతివారం మాదిరే ఈ వారం కూడా మూడు సినిమాలు వచ్చాయి. దానికి ముందు నాలుగైదు సినిమాలు వచ్చేవి. ఈ సారి మాత్రం మూడు వచ్చాయి. టాలీవుడ్లో కొన్ని వారాలుగా ఒక్క సినిమాకైనా పాజిటివ్ టాక్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కూడా జరగలేదు. ఈ వారం మూడు సినిమాలు వచ్చాయి. కానీ ఒక్కదానికి కూడా పాజిటివ్ టాక్ రాలేదు. దాంతో బయ్యర్లకు ఈ సారి చుక్కలు తప్పేలా లేవు.
మంచి అంచనాలతో వచ్చిన చావు కబురు చల్లగా సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో విషయం తక్కువ.. వేదాంతం ఎక్కువైపోయిందంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. కార్తికేయ బాగానే చేసినా కూడా కథనం వీక్ కావడంతో చావు కబురు చల్లగా వెచ్చగా అయిపోయేలా కనిపిస్తుంది.
మరోవైపు మంచు విష్ణు మోసగాళ్లు కూడా డిజాస్టర్ టాక్‌తోనే ఓపెన్ అయింది.హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా తొలిరోజు దారుణంగా నిరాశ పరిచింది. కేవలం 42 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది.
ఇదిలా ఉంటే ఆది సాయికుమార్ నటించిన శశి సినిమా గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. చాలా ఏళ్లుగా వరస ఫ్లాపుల్లో ఉన్న ఆదికి శశి కూడా నిరాశ పరిచేలా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి తరహా రేంజ్లో కథ అనుకున్నా స్క్రీన్ ప్లే లోపాలతో రిజల్ట్ దారుణంగా వచ్చింది.
దాంతో ఈ ఫ్రైడే పూర్తిగా డీప్ ఫ్రై అయిపోయింది. ఒక్క సినిమా కూడా నామమాత్రపు వసూళ్లు కూడా తీసుకురాలేదు. దాంతో వచ్చే వారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

