Thandel | నాగచైతన్య తండేల్‌లో సాయిపల్లవి సోదరిగా కనిపించేది ఈ భామేనట..!
Thandel| టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). తండేల్‌లో కోలీవుడ్ భామ సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోందని తెలిసిందే. ఈ సినిమాలో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది.
Thandel| టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). NC23 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో చైతూ మాస్ లుక్‌లో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. తండేల్‌లో కోలీవుడ్ భామ సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోందని తెలిసిందే.
లవ్‌స్టోరీ తర్వాత చైతూ, సాయిపల్లవి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది. కాగా ఇందులో మరో కీలక పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మంగళవారం సినిమాలో జమిందార్ భార్యలో మెరిసిన దివ్య పిళ్లై (Divya Pillai) తండేల్‌లో మెరువనుంది. తాజా టాక్ ప్రకారం ఈ భామ సాయిపల్లవి సోదరిగా కనిపించనుంది. ఈ మాజీ హెయిర్హోస్టెస్ తండేల్‌లో భాగమవుతున్నందుకు చాలా థ్రిల్ అవుతుండటమే కాదు.. షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుందా..? అంటూ ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తుందట.
తండేల్‌లో సాయిపల్లవి పాత్ర నాగచైతన్య పాత్రతో ప్రేమలో పడిపోయేలా ఉంటుంది. అంతేకాదు తన హక్కుల కోసం తెగించి పోరాడే యువతిగా కూడా కనిపించనుందంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు చందూమొండేటి. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. చైతూ కెరీర్లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. టాప్ బ్యానర్ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కార్తికేయ, సవ్యసాచి, కార్తికేయ 2, ప్రేమమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూమొండేటి నుంచి వస్తున్న సినిమా కావడం.. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. NC23 వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.
The widely adored and loved lady joins the voyage of #NC23 🌊⛵#ShejoinstheNC23Voyage
Yuvasamrat @chay_akkineni @chandoomondeti #BunnyVas @GeethaArts #KarthikTheda pic.twitter.com/BbEvRDBPHd
— BA Raju’s Team (@baraju_SuperHit) September 19, 2023
మత్స్యకారులతో ముఖాముఖి..
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023
Yuvasamrat @chay_akkineni interacting with fisherman in srikakulam 🌊 #NC23 💥#NagaChaitanya @chandoomondeti #BunnyVas pic.twitter.com/5hykOCISNm
— Uday Chaitu (@UdayChaitu9) August 3, 2023
Rugged Yuvasamrat @chay_akkineni landed in Vizag🤙#NC23 🌊🤔 #NagaChaitanya pic.twitter.com/Zs8g42wtrW
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

