తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న గ్రామీణ నేపథ్య రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘హే.. ఓ సుకుమారీ.. కన్నుల దారీ.. నీవైపే చేరే సుందరీ..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, భరత్ మంచిరాజు స్వరపరిచారు. అభిజిత్రావు ఆలపించారు.
ప్రేమలోని మాధుర్యాన్ని అందంగా ప్రజెంట్ చేస్తూ, స్వచ్ఛమైన ప్రేమగీతంలా ఈ పాట సాగింది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తమ అభినయంతో ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో మురళీధర్‌గౌడ్, ఆమని, విష్ణు ఓయ్, ఝాన్సీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్.