Malvi Malhotra | రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు.. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా
Malvi Malhotra | హీరో రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు ఏమాత్రం తెలియదని.. అది ఆయన వ్యక్తిగత విషయమని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తిరగబడర సామీ మూవీలో రాజ్ తరుణ్‌తో కలిసి నటించానని.. అంతే తప్ప వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోలేదని చెప్పింది.
Malvi Malhotra | హీరో రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు ఏమాత్రం తెలియదని.. అది ఆయన వ్యక్తిగత విషయమని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తిరగబడర సామీ మూవీలో రాజ్ తరుణ్‌తో కలిసి నటించానని.. అంతే తప్ప వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోలేదని చెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన రాజ్ తరుణ్ – లావణ్య అంశంపై బాలీవుడ్ నటి మాల్వీ పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మూవీ ప్రచారంలో భాగంగా మాల్వీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ అంశంపై స్పందించింది. తనపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి గతంలో రాజ్ తరుణ్ తనతో ఎన్నడూ మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. తనపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని ఏమాత్రం ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
విమర్శలను స్వీకరిస్తానని.. ఇలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోనని తెలిపింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. ప్రస్తుతం తన ఫోకస్ సినిమాలపైనే ఉందని పేర్కొంది. మూవీలే ఫస్ట్ లవ్ అనీ.. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి తెలియదని.. అందుకే సినిమా గురించే తాను మాట్లాడాలనుకుంటున్నానని చెప్పింది. ఇదిలా ఉండగా.. మాల్వీపై ఆరోపణలు చేసిన లావణ్యపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి అనుచిత సందేశాలను పంపుతోందని ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ తనను మోసం చేసినట్లుగా లావణ్య అనే పోలీసులకు ఫిర్యాదు చేయగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

