Yukti Thareja | ఆమె అలంకరణలో ఆధునికతదే అగ్రస్థానమైనా.. ఆ చిరునవ్వులో సంప్రదాయ సౌందర్యమేదో తొంగిచూస్తున్నది. పాతకొత్తల మేలు కలయిక అన్నమాట. తాను ధరించింది కూడా.. హాఫ్ హాఫ్ డ్రెస్! కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ కావడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. త్రీ క్వార్టర్ స్లీవ్స్‌తో తామర తొడిమెల్లాంటి సుకుమారమైన చేతులు మరింత అందంగా కనిపిస్తున్నాయి.
కుడిచేతికి కట్టిన ఓవర్ సైజ్డ్ వాచీ.. ‘ఉందిలే మంచీ కాలం ముందుముందునా’ అని భరోసా ఇస్తున్నది రంగబలి కథానాయిక యుక్తి తరేజాకు. ముఖ్యంగా ఆ తెలుపు-ఎరుపు కాంబినేషన్ కొత్త మెరుపును తీసుకొచ్చింది. సక్సెస్ పార్టీ లేదా.. యుక్తీ!