అక్కడే మొదలై అక్కడే ముగిసే సినిమా ఇది
‘నా అసలు పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. ఎస్.ఐ పరీక్ష రాసి జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్‌గా సెలక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకూ పదేళ్లు ఆ జాబ్ చేశాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఆ జాబ్‌కి రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను.
‘నా అసలు పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. ఎస్.ఐ పరీక్ష రాసి జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్‌గా సెలక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకూ పదేళ్లు ఆ జాబ్ చేశాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఆ జాబ్‌కి రిజైన్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను. జాబ్ మానేసి సినిమాల్లోకెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ నా కుటుంబసభ్యులు నన్ను ప్రోత్సహించారు. ఇక్కడికొచ్చాక ‘సవారి’ అనే సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అప్పుడే ఈ ‘ది ట్రయల్’ కథ రాసుకున్నాను’ అని దర్శకుడు రామ్ గన్ని అన్నారు.
ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ట్రయల్’. స్పందన పల్లి, యుగ్రామ్, వంశీ కోటు ప్రధానపాత్రధారులు. స్మృతి సాగి, శ్రీనివాసనాయుడు కిల్లాడ నిర్మాతలు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గన్నీ విలేకరులతో మాట్లాడారు. ‘జైలు అధికారిగా నా ఉద్యోగజీవితంలో చాలామంది నేరస్తుల కథలను విన్నాను. వాటి ప్రేరణతోనే ఈ కథ రాసుకున్నాను. ఇదో ఫిక్షనల్ స్టోరీ. ఇప్పటిదాకా మన సినిమాల్లో ఇంటరాగేషన్ సీన్స్ ఉన్నాయిగానీ మొత్తం సినిమా అంతా ఇంటరాగేషన్ మీద లేదు.
‘ది ట్రయల్’ సినిమా ఇంటరాగేషన్ రూమ్‌నుంచి కథ మొదలై, అదే రూమ్‌లో ముగుస్తుంది’ అని చెప్పారు. ఓ హత్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని, ఒక మహిళా ఎస్ఐని ఇంటరాగేషన్ ఆఫీసర్ ఇంటరాగేట్ చేస్తే వారిమధ్య సంభాషణ ఎంత డీప్‌గా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని, సాంకేతికంగా ఉన్నతంగా ఈ సినిమా ఉంటుందని, త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్టులతో ముందుకొస్తానని ఆయన అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

