నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘స్వయంభూ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. గురువారం నిఖిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆగస్ట్‌లో ఈ చిత్రం ప్రారంభంకానుంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో నిఖిల్ కెరీర్లోనే భారీ వ్యయంతో నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: రవి బస్రూర్, ప్రొడక్షన్ డిజైనర్: ఎం. ప్రభాహరన్, రచన-దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.