Shivani Rajashekar | మైసూర్ పాక్‌లో మైసూర్ ఉండదు. ‘జిలేబీ’ సినిమా కథలో తీపితీపి బెల్లం జిలేబీ ముక్కల ప్రస్తావన ఉండవచ్చు, ఉండకపోనూవచ్చు. అయితేనేం.. జిలేబీ పెదాలు.. గులాబీ బుగ్గలు.. షరాబీ కళ్లతో.. ఓ అమ్మాయి హల్చల్ చేయడం మాత్రం పక్కా. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ బేబీ పేరు.. ‘శివానీ’ అని! బ్లాక్ స్లీవ్‌లెస్ జాకెట్.
పసుపు పచ్చ ఖాదీ చీర. పైన కందిరీగ బొమ్మ. చేతికి బంగారు వన్నె వాచీ. మెడలో, చెవులకు యాంటిక్ జువెలరీ. పెదాలపై చిరునవ్వు.. మొత్తంగా ఐదున్నర అడుగులెత్తు గులాబీ పువ్వు!